మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు..

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవ‌ల భారీ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మ‌ర‌మ్మతులు చేప‌ట్టనున్నారు. ఈ మేరకు రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాద‌న‌లు పంపించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఉన్నతాధికారుల‌ను ఆదేశించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లోని ప‌లు అంశాల మీద ఎర్రబెల్లి.. హైద‌రాబాద్‌లోని క్యాంపు కార్యాల‌యంలో సంబంధిత ఉన్నతాధికారుల‌తో బుధ‌వారం స‌మీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పంచాయ‌తీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ప‌దోన్నతులు, పోస్టింగులు, […]

Update: 2021-09-08 01:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవ‌ల భారీ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మ‌ర‌మ్మతులు చేప‌ట్టనున్నారు. ఈ మేరకు రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాద‌న‌లు పంపించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఉన్నతాధికారుల‌ను ఆదేశించారు.

పంచాయ‌తీరాజ్ శాఖ‌లోని ప‌లు అంశాల మీద ఎర్రబెల్లి.. హైద‌రాబాద్‌లోని క్యాంపు కార్యాల‌యంలో సంబంధిత ఉన్నతాధికారుల‌తో బుధ‌వారం స‌మీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పంచాయ‌తీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ప‌దోన్నతులు, పోస్టింగులు, ఇటీవ‌ల ప‌దోన్నతులు పొందిన డీపీఓలు, ఎంపీడీఓలకు పోస్టింగులు, కారోబార్‌లు, పంపు మెకానిక్‌ల స‌మ‌స్యలు, ప‌లు అంశాల‌పై మంత్రి స‌మీక్ష జ‌రిపారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగానే దెబ్బతిన్న రోడ్ల మ‌ర‌మ్మతులు వెంట‌నే చేప‌ట్టాల‌న్నారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న వాటిని పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన ప‌నుల పురోగ‌తిని మంత్రి స‌మీక్షించారు. అలాగే కొత్త రోడ్ల కోసం ప్రతిపాద‌న‌ల‌ను మూడు రోజుల్లోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రజాప్రతినిధుల‌తో మాట్లాడి ప్రతిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని మంత్రి సూచించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో ఇప్పటికే చేప‌ట్టిన ప‌దోన్నతులు పొందిన‌ 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు ఖాళీల‌ను బ‌ట్టి పోస్టింగులు ఇవ్వాల‌ని ఆదేశించారు. అలాగే, ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు ప‌దోన్నతులు క‌ల్పించాల‌ని, ఇందుకు సంబంధించిన నివేదిక‌లు సిద్ధం చేయాల‌ని మంత్రి చెప్పారు.

కారోబార్‌లు, పంపు మెకానిక్‌లు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్యల‌ను ప‌రిశీలించి, నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వెంట‌నే వాటిని ప‌రిష్కరించాల‌ని మంత్రి అధికారుల‌కు చెప్పారు. మిగిలి ఉన్న అతి కొద్ది వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల‌ను సాధ్యమైనంత తొంద‌ర‌లో పూర్తయ్యే విధంగా చూడాల‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో మంత్రితోపాటు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయ‌తీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్‌ సంజీవ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News