పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు: బొత్స
దిశ,వెబ్‌డెస్క్: అమరావతి, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం కార్డులా వాడుకున్నారని, అమరావతిలో వందల ఎకరాల భూమిని బంధువులతో కొనిపించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పేదలకు పట్టాలిచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఎందుకంత ఆక్రోశమని అడిగారు. చంద్రబాబుకు మాన్సస్ ట్రస్ట్ చరిత్ర తెలియదని అన్నారు. 2004లోనే మాన్సస్ ట్రస్ట్‌ను రద్దు చేసి ప్రభుత్వంలో కలపాలని ప్రభుత్వానికి అశోక్ గజపతి రాజు లేఖ రాశారని చెప్పారు.