మంత్రి బాలినేని సెన్సేషనల్ ఛాలెంజ్ 

దిశ, ఏపీ బ్యూరో : ఉచిత విద్యుత్ బిల్లు మొత్తం రైతులకు ముందే ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులపై అదనంగా ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విపక్షాలను సవాల్ చేశారు. ఒంగోలు ఎన్నెస్పీ అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బిల్లులను నేరుగా రైతుల ఖాతాలోకే జమ చేస్తామని […]

Update: 2020-09-02 07:08 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఉచిత విద్యుత్ బిల్లు మొత్తం రైతులకు ముందే ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులపై అదనంగా ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విపక్షాలను సవాల్ చేశారు. ఒంగోలు ఎన్నెస్పీ అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బిల్లులను నేరుగా రైతుల ఖాతాలోకే జమ చేస్తామని తెలిపారు. దీన్ని చంద్రబాబు వక్రీకరించి ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేస్తున్నా మంటూ రైతులను రెచ్చగొట్టడం సరి కాదని హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్ఛిన నూతన సంస్కరణలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టే తాము దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కు ఎంత బిల్లు అవుతుందో ముందుగా అంచనా వేసి ఆ బిల్లును ముందుగా చెల్లిస్తామని బాలినేని వివరించారు.

Tags:    

Similar News