సాంకేతిక సమస్యలను పరిష్కరిచండి
దిశ, వెబ్ డెస్క్: సాంకేతిక సమస్యలతో సంక్షేమ ఫలాలు కొందరికి అందడం లేదని తన దృష్టికి వచ్చినట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొంత మందికి చేరడం లేదని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు. దీంతో సాంకేతిక సమస్యలను పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. బీఆర్‌టీఎస్ రోడ్డును త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. […]
దిశ, వెబ్ డెస్క్:
సాంకేతిక సమస్యలతో సంక్షేమ ఫలాలు కొందరికి అందడం లేదని తన దృష్టికి వచ్చినట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొంత మందికి చేరడం లేదని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు. దీంతో సాంకేతిక సమస్యలను పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. బీఆర్‌టీఎస్ రోడ్డును త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. 8 నియోజక వర్గాల్లో రూ.150 కోట్లతో అభివృద్ది పనులను చేశామని ఆయన అన్నారు.