ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై మంత్రి అనిల్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ నిర్ణయం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇలాంటి ఎస్‌ఈసీతో ఎన్నికలు నిర్వహించడం దౌర్భగ్యం అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి గెలిచే సత్తా లేదని గ్రహించిన చంద్రబాబు ఎస్‌ఈసీని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు పరువు పోతోందనే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుందన్నారు. అయితే, నిమ్మగడ్డ రమేశ్‌పై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ […]

Update: 2021-02-06 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ నిర్ణయం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇలాంటి ఎస్‌ఈసీతో ఎన్నికలు నిర్వహించడం దౌర్భగ్యం అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి గెలిచే సత్తా లేదని గ్రహించిన చంద్రబాబు ఎస్‌ఈసీని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు పరువు పోతోందనే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుందన్నారు. అయితే, నిమ్మగడ్డ రమేశ్‌పై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ నెల 21 వరకు ఇంటి నుంచి రావొద్దని ఎస్‌ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీ చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News