ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేవాదాయశాఖ భూముల పరిర‌క్ష‌ణ‌కు ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. జంట‌న‌గ‌రాల ప‌రిధిలోని దేవాదాయ భూముల రక్షణపై మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు. నిరుప‌యోగంగా ఉన్న ఆల‌య భూముల‌ను గుర్తించి ఆదాయం పొందే మార్గాల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ స‌మావేశంలో […]

Update: 2020-07-29 07:22 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేవాదాయశాఖ భూముల పరిర‌క్ష‌ణ‌కు ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. జంట‌న‌గ‌రాల ప‌రిధిలోని దేవాదాయ భూముల రక్షణపై మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు. నిరుప‌యోగంగా ఉన్న ఆల‌య భూముల‌ను గుర్తించి ఆదాయం పొందే మార్గాల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, దేవాదాయ శాఖ & విజిలెన్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ శేఖ‌ర్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, రీజిన‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి పాల్గొన్నారు.

Tags:    

Similar News