బస్సెక్కిన మంత్రి, ఎమ్మెల్యే
దిశ, ఆదిలాబాద్: వారిద్దరూ ప్రజాప్రతినిధులు.. అందులో ఒకరు మంత్రి.. మరొకరు ఎమ్మెల్యే.. దాదాపు రెండు నెలల నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనల సండలింపులతో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. ఈ క్రమంలో బస్సుల్లో ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయో, ప్రయాణికులు ఏమైన ఇబ్బందులు పడుతున్నారా.. అని తెలుసుకోవడానికి సదురు ప్రజాపత్రినిధులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇంతకీ ఆ ప్రజాప్రతినిధులు ఎవరంటే.. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. వీరిద్దరూ […]
దిశ, ఆదిలాబాద్: వారిద్దరూ ప్రజాప్రతినిధులు.. అందులో ఒకరు మంత్రి.. మరొకరు ఎమ్మెల్యే.. దాదాపు రెండు నెలల నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనల సండలింపులతో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. ఈ క్రమంలో బస్సుల్లో ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయో, ప్రయాణికులు ఏమైన ఇబ్బందులు పడుతున్నారా.. అని తెలుసుకోవడానికి సదురు ప్రజాపత్రినిధులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇంతకీ ఆ ప్రజాప్రతినిధులు ఎవరంటే.. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. వీరిద్దరూ కలసి బుధవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి.. ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం టిఫిన్, భోజన సదుపాయం కల్పించేలా బస్టాండ్‌లోని క్యాంటీన్లు, బేకరీలను తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ పాల్గొన్నారు.