ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దు
దిశ, ఆదిలాబాద్: మక్కలు పండించిన రైతులు తొందరపడి మధ్య దళారీల కు అమ్ముకోవద్దని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రైతులకు మక్కల కొనుగోళ్ల తర్వాత వెంటనే బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, మక్కలకు సరిపడా డబ్బులు ఉన్నాయని, దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండాలని రైతుల ను కోరారు. జిల్లా రైతు […]
దిశ, ఆదిలాబాద్: మక్కలు పండించిన రైతులు తొందరపడి మధ్య దళారీల కు అమ్ముకోవద్దని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రైతులకు మక్కల కొనుగోళ్ల తర్వాత వెంటనే బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, మక్కలకు సరిపడా డబ్బులు ఉన్నాయని, దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండాలని రైతుల ను కోరారు. జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్ రాంరెడ్డి పాల్గొన్నారు.
Tags: Adilabad,Minister Allola Inidrakaran reddy,start Of corn purchase center