మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయండి

దిశ, వెబ్‌డెస్క్: రానున్న నాలుగైదు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన మంత్రి ఆళ్ల నాని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాజ్‌వేల వద్ద ముందస్తుగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం […]

Update: 2020-10-20 01:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: రానున్న నాలుగైదు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన మంత్రి ఆళ్ల నాని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాజ్‌వేల వద్ద ముందస్తుగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం ఉన్నచోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News