వర్షాకాలం సాగుకు అన్ని ఏర్పాట్లు చేయాలి: మంత్రి అజయ్
దిశ, ఖమ్మం: వర్షాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధం కావాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం జడ్పీ హాలులో వ్యవసాయ శాఖ అధికారులు, ఫర్టిలైజర్ డీలర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం పంట కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంచాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా జీలుగ, పెసర, జనుము, వరి, పత్తి, మిరప విత్తనాలను సమకూర్చుకుని అందుబాటులో ఉంచుకోవాలని […]
దిశ, ఖమ్మం: వర్షాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధం కావాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం జడ్పీ హాలులో వ్యవసాయ శాఖ అధికారులు, ఫర్టిలైజర్ డీలర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం పంట కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంచాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా జీలుగ, పెసర, జనుము, వరి, పత్తి, మిరప విత్తనాలను సమకూర్చుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 6.90 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను సడలించినందున ఖమ్మం పట్టణంలో సరిబేసి విధానంలో దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, జేడీఏ ఝాన్సీ లక్ష్మీకుమారి, శ్రీనివాస్ నాయక్, డీలర్లు, మనోహర్, రామబ్రహ్మం, పీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: rainy season, crops, officers must take action now onwards, minister ajaykumar