రైతులను మోసం చేస్తున్న మిల్లర్లు.. తహసీల్దార్‌‌ను ఆశ్రయించిన అన్నదాత

దిశ, మల్లాపూర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క రైతన్న ఎన్నో కష్టాలు అనుభవిస్తూ తమ సాగు భూముల్లో పంటను పండిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు కేంద్రాల యాజమాన్యాలు లూటీ చేస్తున్నాయి. మల్లాపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకి మూడు కిలోల తరుగు తీస్తూ మోసం చేస్తున్నారని రైతులు సోమవారం రోజున మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ […]

Update: 2021-12-28 01:17 GMT

దిశ, మల్లాపూర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క రైతన్న ఎన్నో కష్టాలు అనుభవిస్తూ తమ సాగు భూముల్లో పంటను పండిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు కేంద్రాల యాజమాన్యాలు లూటీ చేస్తున్నాయి. మల్లాపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకి మూడు కిలోల తరుగు తీస్తూ మోసం చేస్తున్నారని రైతులు సోమవారం రోజున మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ మేరకు రైతు పేర్క భూమయ్య మాట్లాడుతూ.. తాను పండించిన 376 బస్తాలకి ఏడు క్వింటాళ్ల 54 కిలోల తరుగును సహకార సంఘం వారు తీసారని వారిని అడిగితే తనకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారని అన్నారు. రైస్‌మిల్ వారే మూడు కిలోల తరుగు ఉంటేనే వడ్లను తీసుకుంటామని చెప్పడంతో.. తాము ఎవరికి వివరించాలో తెలియక.. రైతులు ఎమ్మార్వోతో మొరపెట్టుకున్నారని అన్నారు. హమాలీ కూలీలకు సైతం 36 రూపాయలు క్వింటాలుకి ఇచ్చామని, అంతేకాకుండా ప్రభుత్వం తిరిగి ఇచ్చే పది రూపాయల హమాలీ ఖర్చు డబ్బులకు నాలుగు సీజన్‌ల నుండి లెక్కలు చూపించడం లేదని ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మంది రైతన్నలకు నష్టం వాటిల్లిందని.. తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే స్పందించి నష్ట పరిహారం అందించేలా చూడాలని రైతులు కోరారు. కష్టపడి పండించిన పంట రాబంధులు అందుకు పోతున్నారని పలుమార్లు విన్నవించుకున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని, రైతు కష్టాల్ని నీళ్లల్లో పోసిన పన్నీరులా తరలిస్తున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారు లేదో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News