అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికం : సీపీఐ నారాయణ

దిశ, వెబ్ డెస్క్: అర్థరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమని సీపీఐ నేత నారాయణ అన్నారు. సీపీఐ పోలవరం పరిరక్షణ యాత్ర నేపథ్యంలో సీపీఐ నాయకులను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పోలవరాన్ని సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం సందర్శనకు అనుమతించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా పూర్తి కాకుండానే గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ వెళుతోందని అన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీని ఎదుర్కొనేందుకు బీజేపీ మతం కార్డు వాడుతోందన్నారు. […]

Update: 2020-11-22 00:38 GMT

దిశ, వెబ్ డెస్క్: అర్థరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమని సీపీఐ నేత నారాయణ అన్నారు. సీపీఐ పోలవరం పరిరక్షణ యాత్ర నేపథ్యంలో సీపీఐ నాయకులను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పోలవరాన్ని సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం సందర్శనకు అనుమతించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఓటర్ల జాబితా పూర్తి కాకుండానే గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ వెళుతోందని అన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీని ఎదుర్కొనేందుకు బీజేపీ మతం కార్డు వాడుతోందన్నారు. ఇక తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Tags:    

Similar News