‘ఫ్యామిలీ సేఫ్టీ’ కోసం మైక్రోసాఫ్ట్ యాప్
దిశ, వెబ్‌డెస్క్ : డిజిటల్ యుగంలో ‘నెట్’ మన నట్టింట్లోకే కాదు.. బెడ్ రూమ్‌లోకి కూడా వచ్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ నట్టింట్లోనే ఉన్నా.. నెట్టింట్లోనే గడుపుతున్నారు. నెట్ వల్ల ఎన్ని లాభాలున్నా.. నష్టాలూ లేకపోలేదు. ముఖ్యంగా చిన్నారులు, యూత్ ఇంటర్నెట్ వాడకం విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. పైగా ఇటీవల కాలంలో స్క్రీన్ టైమింగ్ చాలా వరకు పెరిగినట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడంతా ఓటీటీల కాలం.. అందులో వచ్చే వెబ్ […]
దిశ, వెబ్‌డెస్క్ :
డిజిటల్ యుగంలో ‘నెట్’ మన నట్టింట్లోకే కాదు.. బెడ్ రూమ్‌లోకి కూడా వచ్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ నట్టింట్లోనే ఉన్నా.. నెట్టింట్లోనే గడుపుతున్నారు. నెట్ వల్ల ఎన్ని లాభాలున్నా.. నష్టాలూ లేకపోలేదు. ముఖ్యంగా చిన్నారులు, యూత్ ఇంటర్నెట్ వాడకం విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. పైగా ఇటీవల కాలంలో స్క్రీన్ టైమింగ్ చాలా వరకు పెరిగినట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడంతా ఓటీటీల కాలం.. అందులో వచ్చే వెబ్ సిరీస్‌లో అడల్డ్ కంటెంట్ ఉండటంతో పాటు వాటికి సెన్సార్‌షిప్ కూడా లేదు. మరోవైపు యూట్యూబ్, ఇతర పోర్న్ సైట్లలోనూ అశ్లీల వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ ‘ఫ్యామిలీ సేఫ్టీ యాప్’ తీసుకొచ్చింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘ఫ్యామిలీ సేఫ్టీ యాప్’కు సంబంధించి మే నుంచి బీటా వెర్షన్‌ను చెక్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ యాప్‌ను ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ యూజర్ల యాక్టివిటీని మానిటర్ చేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీన్ యూసేజ్ టైమ్‌ను లెక్కిస్తుంది. కుటుంబ సభ్యుల హెల్తియర్ డిజిటల్ హ్యాబిట్స్ కోసమే ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. స్క్రీన్ టైమ్, పేరెంటల్ కంట్రోల్స్ ద్వారా పిల్లల వెబ్ బ్రౌజింగ్ యాక్సెస్‌ను నచ్చిన విధంగా మార్పులు చేసి, వాళ్లు బ్రౌజ్ చేసే కంటెంట్‌ను నియంత్రించవచ్చు. అలాగే వారు ఎంతసేపు ఫోన్ ఉపయోగిస్తున్నారో తెలుసుకుని వారి ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ ‘ఫ్యామిలీ సేఫ్టీ యాప్’ ద్వారా అడల్ట్ కంటెంట్‌ను బ్లాక్ చేసి, అశ్లీల వీడియోల జోలికి వెళ్లకుండా చేయొచ్చు. అందుకోసం పోర్న్ కంటెంట్ అందించే వెబ్‌సైట్స్‌ను బ్లాక్డ్ జాబితాలో యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు యాప్ యూసేజ్, స్క్రీన్ టైమ్ వివరాల రిపోర్ట్ ఫోన్‌కు వస్తుంది.
డిజిటల్ స్కూల్ ..
కరోనా వల్ల స్కూళ్లు మూతపడటంతో.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అవసరం ఎంతో ఏర్పడింది. పాఠాలు, హోమ్ వర్క్‌లు, రీక్రియేషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫోన్, ల్యాపీ, పీసీలకు షిఫ్ట్ అయిపోయాయి. ట్రాకింగ్ స్క్రీన్ టైమ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. పిల్లల స్క్రీన్ టైమ్‌కు బౌండరీలు పెట్టడం ఇప్పుడు సరైన పనే.
లొకేషన్ ట్రాకింగ్..
ఈ యాప్ వల్ల మరో ఉపయోగం ఏంటంటే.. లొకేషన్ ట్రాకింగ్. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటకెళ్తే.. లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ద్వారా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ల లాస్ట్ నోన్ లొకేషన్ తెలుసుకోవచ్చు.