అత్యాధునిక ఫీచర్లతో ఎంఐ స్మార్ట్ వాచ్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ మొబైల్ కంపెనీ కేవలం ఫోన్లనే కాదు.. అత్యాధునిక ఫీచర్లతో యువతను ఆకట్టుకునే డిజైన్లతో స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి తెస్తోంది. ఈ వాచ్‌తోపాటు మరో స్మార్ట్ మొబైల్(Xiaomi Mi Watch)ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. జూన్ 22న లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ వాచ్(MI smartwatch), ఎంఐ 11 లైట్ మొబైల్(MI11 Lite Mobile)ను విడుదల చేయనున్నట్లు షియోమీ కంపెనీ ప్రకటించింది. భారత్‌లో స్మార్ట్ వాచ్ ధర రూ.10,999లకు లభించనుంది. ఈ వాచ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ మొబైల్ కంపెనీ కేవలం ఫోన్లనే కాదు.. అత్యాధునిక ఫీచర్లతో యువతను ఆకట్టుకునే డిజైన్లతో స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి తెస్తోంది. ఈ వాచ్‌తోపాటు మరో స్మార్ట్ మొబైల్(Xiaomi Mi Watch)ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. జూన్ 22న లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ వాచ్(MI smartwatch), ఎంఐ 11 లైట్ మొబైల్(MI11 Lite Mobile)ను విడుదల చేయనున్నట్లు షియోమీ కంపెనీ ప్రకటించింది. భారత్‌లో స్మార్ట్ వాచ్ ధర రూ.10,999లకు లభించనుంది. ఈ వాచ్ అమెజాన్(Amazon), ఎంఐ.కాం(MI.com) లో అందుబాటులో ఉండనుంది. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్డ్(Flip Card)లో లభించనుంది.
స్మార్ట్ వాచ్ ఫీచర్ల ఇవే..
స్మార్ట్ వాచ్‌లో ఎస్‌పీఓ2 మానిటరింగ్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండనుంది. హార్ట్ రేట్ మానిటర్, బిల్ట్-ఇన్ జీపీఎస్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ నోటిఫికేషన్ వంటి ఎన్నో ఫీచర్లను ఎంఐ ఇందులో అందించనుంది. 1.39 అంగుళాల గుండ్రటి డిస్‌ప్లే రూపొందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 454 × 454 పిక్సెల్స్‌గా ఉంది. స్మార్ట్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దాదాపు 110కి పైగా వాచ్ ఫేసెస్‌నను ఇందులో అందించారు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 420 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి చార్జ్ పెడితే దాదాపు 15 రోజుల వరకు చార్జీంగ్ వచ్చే అవకాశం ఉంది. బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.