దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు.. ఎప్పటివరకు?
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమవారం నుంచి లాక్‌డౌన్ 4.0 అమల్లోకి రానున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక కార్యకలాపాలకు దశల వారీగా మినహాయింపులనిస్తున్నట్టు పేర్కొంది. అయితే, త్వరలో ఈ లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మూడో దశ లాక్‌డౌన్ ఆదివారం (మే 17వ తేదీ) నాటితో […]
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమవారం నుంచి లాక్‌డౌన్ 4.0 అమల్లోకి రానున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక కార్యకలాపాలకు దశల వారీగా మినహాయింపులనిస్తున్నట్టు పేర్కొంది. అయితే, త్వరలో ఈ లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మూడో దశ లాక్‌డౌన్ ఆదివారం (మే 17వ తేదీ) నాటితో ముగిసిపోనున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. నాలుగో దశ లాక్‌డౌన్ ఉంటుందని, దానికి సంబంధించిన ప్రకటన మే 18లోపే ఉంటుందని వివరించిన సంగతి తెలిసిందే.