MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారా.. అయితే ఇలా చేయండి

దిశ, డైనమిక్ బ్యూరో: MRP (maximum retail price) ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మడం నేరమని మీకు తెలుసా..? అవును ముమ్మాటికీ నేరమే అని లీగల్ మెట్రాలజీ అధికారులే చెబుతున్నారు. బస్ స్టేషన్ లు, రైల్వే ప్లాట్ ఫామ్ లు, ఇతర షాపింగ్ కాంప్లెక్సుల్లో వారు చెప్పిన రేటుకు వాటర్ బాటిళ్లు, తినుబండారాలను కొనేస్తుంటాం. కంపెనీ పేరును, మోడల్‌ని కాపీ కొడుతూ అమ్మేస్తుంటారు. అయితే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు (Legal […]

Update: 2021-09-04 08:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: MRP (maximum retail price) ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మడం నేరమని మీకు తెలుసా..? అవును ముమ్మాటికీ నేరమే అని లీగల్ మెట్రాలజీ అధికారులే చెబుతున్నారు. బస్ స్టేషన్ లు, రైల్వే ప్లాట్ ఫామ్ లు, ఇతర షాపింగ్ కాంప్లెక్సుల్లో వారు చెప్పిన రేటుకు వాటర్ బాటిళ్లు, తినుబండారాలను కొనేస్తుంటాం. కంపెనీ పేరును, మోడల్‌ని కాపీ కొడుతూ అమ్మేస్తుంటారు. అయితే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు (Legal Metrology Officials) సిద్ధమయ్యారు. ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఎమ్ఆర్‌పీ(MRP) ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్న కిరాణా, ఉడిపి హోటల్ లో వాటర్ బాటిల్, ఇతర వస్తువులను సామాజిక వేత్త ఉమేష్ కొనుగోలు చేశారు. అయితే వస్తువులను అధిక ధరలకు అమ్ముతుండటంతో అందరిలా ఊరుకోకుండా… వెంటనే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మెట్రాలజీ అధికారులు సదరు దుకాణాలపై చర్యలు తీసుకునేందుకు ముందుకొచ్చారు. అంతేకాకుండా వారిపై లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009, సెక్షన్ 18/36 లోని రూల్-4, 6(1)(A),(D),(E), 6(2), లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2011 లోని రూల్ 18(1),18(2) ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఉమేష్ ట్విట్టర్ వేదికగా అందరికీ అవగాహన కల్పించే విధంగా పోస్ట్ చేశారు. మీ హక్కులను తెలుసుకోండంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ నగరంలో ఎక్కడెక్కడ ఎమ్‌ఆర్‌పీ ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారో కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: డంపింగ్ యార్డులో మోడల్ క్యాట్ వాక్.. ఎందుకో తెలుసా..?

Tags:    

Similar News