నీవేమైనా అర్జునిడివా..?

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ వైరలవుతోన్నది. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తున్న కరోనా గురించే ఈ మెసేజ్ ఉంది. కరోనా కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇంటినుంచి బయటకు రాకుండా ఉంటూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటో మీరూ చదవండి.. “ఒక భక్తుడు కరోనా సోకి స్వర్గస్తుడైనాడు. వైకుంఠంలో శ్రీ మహా విష్ణువుని చూసి, ప్రభు […]

Update: 2020-04-03 04:00 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ వైరలవుతోన్నది. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తున్న కరోనా గురించే ఈ మెసేజ్ ఉంది. కరోనా కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇంటినుంచి బయటకు రాకుండా ఉంటూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటో మీరూ చదవండి..

“ఒక భక్తుడు కరోనా సోకి స్వర్గస్తుడైనాడు. వైకుంఠంలో శ్రీ మహా విష్ణువుని చూసి, ప్రభు నేను నీ భక్తుడను, నన్ను కాపాడడానికి నీవు రాలేదు. ఇది నీకు తగునా? అని ప్రశ్నించాడు. దానికి, శ్రీమన్నారాయణుడు చిరు మందహాసం చేసి, ఓ భక్తాగ్రజ , నేను ప్రధాన మంత్రి రూపంలో, ముఖ్య మంత్రి రూపంలో, పోలీస్ రూపంలో, మునిసిపాలిటీ ఉద్యోగి రూపంలో, కాలనీ కమిటీ సభ్యుని రూపంలో వచ్చి, ఇంటిలోనే పడుండరా అని పదే పదే చెప్పినా , వినక, ఊరి మీద పడి తిరిగావు, నీవేమైనా అర్జునిడివా నీకు విశ్వరూపం దాల్చి భగవద్గీత బోధించడానికి? 😊😊” అని మెసేజ్ లో ఉంది. ఇది నెటిజన్లు బాగుందంటూ ప్రశంసిస్తూ వైరల్ చేస్తున్నారు.

Tags: social media, corona, viral

Tags:    

Similar News