సోషల్ మీడియాలో వైరల్ పోస్టు.. వాస్తవం
ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక మాధ్యమాల్లో విద్యుత్ శాఖ విన్నపం పేరిట ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల సేపు లైట్లు ఆపి, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే… కానీ, ఇప్పటికే, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్‌లో ఉన్నందున, మాకు గ్రిడ్‌లో దేశీయ లోడ్లు మరియు అవసరమైన సేవల లోడ్లు మాత్రమే ఉన్నాయి. క్రియాశీల (ప్రస్తుత) లైటింగ్ […]
ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక మాధ్యమాల్లో విద్యుత్ శాఖ విన్నపం పేరిట ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల సేపు లైట్లు ఆపి, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే… కానీ, ఇప్పటికే, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్‌లో ఉన్నందున, మాకు గ్రిడ్‌లో దేశీయ లోడ్లు మరియు అవసరమైన సేవల లోడ్లు మాత్రమే ఉన్నాయి.
క్రియాశీల (ప్రస్తుత) లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40% కన్నా తక్కువ కాబట్టి, గ్రిడ్‌లోని అన్ని లైట్ల ఆకస్మిక (ఏకకాలంలో) స్విచ్-ఆఫ్ చేయడం విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం).
కాబట్టి, దయచేసి, ఫ్రిజ్‌లు మరియు ఎసిలు వంటి కొన్ని లోడ్‌లను ఆన్‌లో ఉంచమని ప్రజలకు సలహా ఇవ్వండి.గ్రిడ్ కూలిపోతే, రోగులకు చికిత్స చేస్తున్న అన్ని ఆసుపత్రులు వారి క్లిష్టమైన విద్యుత్ సరఫరాను కోల్పోవచ్చు.కావున నేడు అంటే 5 వ తేదీ నాడు మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు 9 నిమిషాలు క్యాండిల్ వెలిగించినపుడుఓన్లీ లైటింగ్ ఆఫ్ చేయగలరు.లైట్లు తప్ప ఫ్యాన్, ఫ్రిడ్జ్, ఏసి తదితర విద్యుత్ ఉపకరణాలన్నీ ఆన్ చేసి ఉంచండి. ఎందుకంటే గ్రిడ్ మీద లోడ్ పడకుండా ఉండేందుకు ఇలా చేయండి.
గ్రిడ్‌ను సేవ్ చేయడానికి ఇదే మార్గం. దయచేసి వీలైనంతమందికి ఫార్వార్డ్ చేయండి. అంటూ ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్‌రౌత్ కూడా ఇటువంటి ఆందోళననే వ్యక్తం చేశారు. అయితే ఇది ఫేక్ మెసేజ్ అని, దానికి విద్యుత్ శాఖకు సంబంధం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే… ఒకేసారి లైట్లు స్విచ్ఛాఫ్ చేయడం వల్ల పవర్‌గ్రిడ్ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నారు. ప్రతి రోజూ పది గంటల తరువాత ఇళ్లలోని వారు లైట్లు ఆఫ్ చేస్తారని, అలా చేయడం వల్ల గ్రిడ్ పడిపోతుందా? అంటూ హేతువాదులు ప్రశ్నిస్తున్నారు.
Tags: pm modi, narendra modi, lights off, power grid effect, social media, fake message