యూట్యూబ్ వీడియోలతో దొంగయ్యాడు
దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ వీడియోలు చూసి బొమ్మ తుపాకీ కొనుగోళు చేసిన ఓ బట్టల వ్యాపారి బ్యాంక్ రాబడి చేశాడు. లాక్‌డౌన్‌లో నష్టాలను చవిచూసిన అతడు దొంగతనం చేసి వాటిని కవర్ చేద్దామనుకున్నాడు. కానీ, చివరకు కటకటాల పాలయ్యాడు. భువనేశ్వర్ జిల్లా తంగిబంటకు చెందిన బట్టల వ్యాపారి సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు… రెడీమేడ్ బట్టలు అమ్ముకొని జీవనం సాగించేవాడు. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో వ్యాపారం దివాలా తీసింది. దీంతో లక్షల్లో నష్టపోయాడు. రూ. 19 లక్షల […]
దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ వీడియోలు చూసి బొమ్మ తుపాకీ కొనుగోళు చేసిన ఓ బట్టల వ్యాపారి బ్యాంక్ రాబడి చేశాడు. లాక్‌డౌన్‌లో నష్టాలను చవిచూసిన అతడు దొంగతనం చేసి వాటిని కవర్ చేద్దామనుకున్నాడు. కానీ, చివరకు కటకటాల పాలయ్యాడు.
భువనేశ్వర్ జిల్లా తంగిబంటకు చెందిన బట్టల వ్యాపారి సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు… రెడీమేడ్ బట్టలు అమ్ముకొని జీవనం సాగించేవాడు. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో వ్యాపారం దివాలా తీసింది. దీంతో లక్షల్లో నష్టపోయాడు. రూ. 19 లక్షల మేర రుణాలు తీసుకున్నాడు. కానీ, వ్యాపారం మూతపడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కనీసం వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేదు. దీంతో యూట్యూబ్ పుణ్యమా అని బ్యాంక్ రాబడి ఎలా అనే వీడియోలను చూశాడు. నిత్యం అదే వీడియోలను చూస్తూ దొంగగా మారిపోయాడు.
పథకం ప్రకారం ఓ బొమ్మ తుపాకీని కొనుగోళు చేశాడు. స్థానిక ఇన్ఫోసిటీకి సమీపంలో గత నెల 8న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 28 తేదీన మంచేశ్వర్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, బరిముండా బ్రాంచ్ లల్లో బెదిరింపులు చేసి పెద్ద మొత్తంలో నగదు దోచుకున్నాడు. దోచుకుంది ఎంతనో స్పష్టత లేదుగాని.. చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుని నుంచి రూ. 12 లక్షలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. యూట్యూబ్ వీడియోలు చూసి పాపులర్ అయ్యేవాళ్లు సైతం ఇతడి నిర్వాహకం చూసి షాక్ అవుతున్నారు.