బుటన్ తెగ ప్రజల ‘నీలికళ్ల’ సోయగం
దిశ, వెబ్‌డెస్క్: నీలి కళ్లను కలిగిఉన్నవారు భలే అందంగా ఉంటారు. కానీ అలాంటి కళ్లు చాలా తక్కువ మందికే ఉంటాయి. అయితే ఇండోనేషియాలోని మెజారిటీ ప్రజలది మాత్రం డార్క్ హెయిర్, డార్క్ కనులే. అక్కడి ఆగ్నేయ సులవెసి ప్రాంతంలోని బుటన్ ఐలాండ్ తెగకు చెందిన వారిలో ఎక్కువ మందికి నీలి రంగు కళ్లు ఉండటం విశేషం. మరి ఇక్కడి ప్రజల్లో మాత్రమే ‘బ్లూ ఐస్’ ఉండటానికి కారణమేంటి? బుటన్ ఐలాండ్‌లోని ‘బుటన్’తెగ ప్రజల్లోని కొందరికి రెండు కనులు […]
దిశ, వెబ్‌డెస్క్: నీలి కళ్లను కలిగిఉన్నవారు భలే అందంగా ఉంటారు. కానీ అలాంటి కళ్లు చాలా తక్కువ మందికే ఉంటాయి. అయితే ఇండోనేషియాలోని మెజారిటీ ప్రజలది మాత్రం డార్క్ హెయిర్, డార్క్ కనులే. అక్కడి ఆగ్నేయ సులవెసి ప్రాంతంలోని బుటన్ ఐలాండ్ తెగకు చెందిన వారిలో ఎక్కువ మందికి నీలి రంగు కళ్లు ఉండటం విశేషం. మరి ఇక్కడి ప్రజల్లో మాత్రమే ‘బ్లూ ఐస్’ ఉండటానికి కారణమేంటి?
బుటన్ ఐలాండ్‌లోని ‘బుటన్’తెగ ప్రజల్లోని కొందరికి రెండు కనులు నీలి రంగులో ఉండగా.. కొందరికి మాత్రం ఒక కన్ను నలుపు, మరో కన్ను నీలి రంగులో ఉంది. దీనికి కారణం ‘వార్డెన్ బర్గ్ సిండ్రోమ్’. జన్యువుల మార్పుల వల్ల ఈ అరుదైన వ్యాధి వస్తుంది. కొద్ది మేర వినికిడి లోపంతో పాటు పిగ్మెంటేషన్ డెఫీషియన్సీస్ వస్తుంటాయి. ఈ సిండ్రోమ్ వల్ల ముఖ్యంగా బ్రైట్ బ్లూ ఐస్ రావడం జరుగుతుంది. ‘వార్డెన్ బర్గ్ సిండ్రోమ్’ 42వేల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి. కానీ బుటన్ తెగలోని చాలా మంది ప్రజలు ఈ వ్యాధి వల్ల నీలి కళ్లతో కనువిందు చేస్తుంటారు. ఈ సిండ్రోమ్ వల్ల కొందరిలో చర్మం, కేశాల రంగు కూడా మారుతుంది. దీనికి చికిత్స లేదు. కొందరిలో మెలనోసైట్స్ లేకపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
బుటన్ తెగ ప్రజలను గురించి తెలుసుకున్న ఇండోనేషియా జియాలాజిస్ట్, ఫొటోగ్రాఫర్ కొరిచినొయ్ పసరెబు వాళ్ల ఫోటోలను తీసి, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో బుటన్ తెగ ప్రజల నీలి కళ్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.