టైటిల్ ప్రకటించిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం గురించి ప్రస్తావిస్తున్న క్రమంలో చిత్రం పేరును ‘ఆచార్య’గా ప్రకటించారు. […]

Update: 2020-03-01 19:56 GMT

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం గురించి ప్రస్తావిస్తున్న క్రమంలో చిత్రం పేరును ‘ఆచార్య’గా ప్రకటించారు. దీంతో ఏకంగా మెగాస్టార్ చిత్రం పేరును స్పష్టం చేయడంతో అక్కడున్న అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. అనంతరం కొద్ది ఆలోచనలో పడ్డ ఆయన మళ్లీ మట్లాడుతూ.. ‘‘ ఎక్కడ మిస్సయ్యానో తెలియడం లేదు. కొరటాల శివ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చిత్రం టైటిల్‌ను లాంఛ్ చేద్దాం అనుకున్నారు. కానీ నా నోటి ద్వారా లాంఛ్ అయిపోయింది. సారీ శివ ఏమి అనుకోవద్దు. మంచి వార్తలు ఆపుకోలేం. వాటిని ఆపడం కూడా కరెక్టు కాదు’’ అని అన్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News