భేటీ ఫలప్రదం : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో భేటీ ఫలప్రదంగా ముగిసిందని అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి ముందుకెళ్లేందుకు ఇరువురూ అంగీకరించినట్టు వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్, మరో ఆరుగురు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. […]

Update: 2020-02-19 05:24 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో భేటీ ఫలప్రదంగా ముగిసిందని అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి ముందుకెళ్లేందుకు ఇరువురూ అంగీకరించినట్టు వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్, మరో ఆరుగురు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలు, ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించినా.. ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. కాగా, ఢిల్లీ సీఎంగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత అమిత్ షా‌తో మొదటి సారిగా ఈ చర్చలు జరగడం గమనార్హం.

Tags:    

Similar News