కాఫీ పొడిలో.. గాంధీ నవ్వులు
దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణం చాలా కూల్‌గా ఉంది. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇలాంటి టైమ్‌లో వేడి వేడి కాఫీ తాగితే.. ఆ మజానే వేరు కదా! చాలామంది ఇలానే అనుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన శివరామన్ రాజలింగానికి మాత్రం అదే కాఫీని చూస్తే.. మదిలో ఓ అద్భుతమైన ఆర్ట్ ఆవిష్కృతమవుతుంది. కాఫీకి, ఆర్ట్‌కు సంబంధం ఏంటంటారా? కుంచెతో పనిలేకుండా శివరామన్.. కాఫీ పొడితో ఎంతో అందమైన బొమ్మలను అలవోకగా వేస్తుంటాడు. […]
దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణం చాలా కూల్‌గా ఉంది. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇలాంటి టైమ్‌లో వేడి వేడి కాఫీ తాగితే.. ఆ మజానే వేరు కదా! చాలామంది ఇలానే అనుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన శివరామన్ రాజలింగానికి మాత్రం అదే కాఫీని చూస్తే.. మదిలో ఓ అద్భుతమైన ఆర్ట్ ఆవిష్కృతమవుతుంది. కాఫీకి, ఆర్ట్‌కు సంబంధం ఏంటంటారా? కుంచెతో పనిలేకుండా శివరామన్.. కాఫీ పొడితో ఎంతో అందమైన బొమ్మలను అలవోకగా వేస్తుంటాడు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 74 గాంధీ ముఖాలను కలిపి ఓ అతిపెద్ద గాంధీ బొమ్మ గీశాడు. ఈ క్రమంలో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ కూడా బద్దలు కొట్టాడు.
తమిళనాడులోని ఓ స్కూల్‌లో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్న శివరామన్ రాజలింగం.. ఆగస్టు 15న కాఫీ పొడితో గాంధీ బొమ్మలను వేశారు. మొత్తం 74 చిత్రాలను తాను పనిచేసే స్కూల్ ఆవరణలో గీశాడు. అంతేకాదు ఈ సంవత్సరం గుర్తుండిపోయేలా.. 2020 అడుగుల్లో గాంధీజీ 74 ముఖాలను ఆయన రూపొందించారు. ఇందుకోసం శివరామన్‌కు 22 గంటల 30 నిమిషాల సమయం పట్టింది. ఈ క్రమంలోనే ఆయన గత ప్రపంచ రికార్డును కూడా బ్రేక్ చేశారు. అయితే దీనికి సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా శివరామన్ రూపొందించిన గాంధీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చెన్నైలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన శివరామన్.. గతంలో కాఫీ పొడితో వేసిన ‘జీసస్ ఆర్ట్’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. దీనికోసం ఆయన 864 గంటలు (72 రోజులు ) సమయం తీసుకున్నాడు. కాఫీ పొడితో లార్జెస్ట్ పెయింటింగ్ వేసిన రికార్డు.. గతంలో సైప్రస్‌కు చెందిన అలెక్స్ ఝాగియాన్ పేరుతో ఉండేది. ఆయన 1704 అడుగుల్లో ఆ పెయింటింగ్ వేశాడు.