నాలుగు చెవుల పిల్లి.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా ఫొటోలు!
దిశ, ఫీచర్స్: ప్రాచీన గ్రీకు రాజు మిడాస్‌కు బంగారమంటే చాలా ఇష్టం. ఒకరోజు అదృష్ట దేవత ప్రత్యక్షమై.. మిడాస్ ఏ వస్తువు తాకినా బంగారంగా మారిపోయే వరాన్ని ప్రసాదించిందని గ్రీకు పురాణాల్లో చదువుకున్నాం. దీన్ని ‘గోల్డెన్ టచ్ లేదా మిడాస్ టచ్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. మిడాస్ జన్యు పరివర్తన కారణంగా నాలుగు చెవులు సహా లోపభూయిష్ట దవడతో జన్మించాడు. తాజాగా మిడాస్ మాదిరే నాలుగు చెవులతో జన్మించిన ఓ పిల్లి ఇంటర్నెట్ […]
దిశ, ఫీచర్స్: ప్రాచీన గ్రీకు రాజు మిడాస్‌కు బంగారమంటే చాలా ఇష్టం. ఒకరోజు అదృష్ట దేవత ప్రత్యక్షమై.. మిడాస్ ఏ వస్తువు తాకినా బంగారంగా మారిపోయే వరాన్ని ప్రసాదించిందని గ్రీకు పురాణాల్లో చదువుకున్నాం. దీన్ని ‘గోల్డెన్ టచ్ లేదా మిడాస్ టచ్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. మిడాస్ జన్యు పరివర్తన కారణంగా నాలుగు చెవులు సహా లోపభూయిష్ట దవడతో జన్మించాడు. తాజాగా మిడాస్ మాదిరే నాలుగు చెవులతో జన్మించిన ఓ పిల్లి ఇంటర్నెట్ సంచలనంగా మారింది.
టర్కీలోని అంకారాలో పుట్టిన ఓ పిల్లిని కానిస్ డోస్మెసి కుటుంబం దత్తత తీసుకుంది. నాలుగు చెవులతో పుట్టడం వల్ల ఆ పిల్లిని పెంచుకునేందుకు ఎవరూ ఇష్టపడరనే ఉద్దేశంతో డోస్మెసి ఇంటికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి తన ఇంట్లో ఉన్న సుజీ, జైనోలతో ‘మిడాస్’ పిల్లి హ్యాపీగా జీవించేస్తుంది. దాని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిల్లి ఆరోగ్య పరిస్థితి బాగుందని, నాలుగు చెవులున్నా దానికి ఎలాంటి వినికిడి లోపం లేదని పశువైద్యుడు రెసాట్ నూరి అస్లాన్ పేర్కొన్నాడు.
‘పిల్లుల్ని ప్రత్యేకంగా కొనుగోలు చేసే బదులు వీధుల్లో ఉంటే వాటిని దత్తత తీసుకోవడం ఉత్తమం. మా పిల్లిని చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ప్రతీరోజు ఎంతోమంది దాన్ని చూడటానికి వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది మరింత పాపులర్‌గా మారిపోయింది. కొందరు వ్యక్తులు ఈ పిల్లిని చూసి భయపడుతూ అశుభంగా భావిస్తే, మరికొందరు మాత్రం దానిపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు’ అని డోస్మెసి పేర్కొంది.