వెదర్ అప్‌డేట్స్‌తో రైతులకు సాయం చేస్తున్న ఏపీ వెదర్‌మ్యాన్

దిశ, ఫీచర్స్ : బంగాళఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న రోజుల్లో తుఫాన్ వచ్చే సూచన, అక్కడక్కడ మూడు రోజులు జల్లులు పడే అవకాశం. ఈసారి నైరుతి ముందే పలకరించనుంది. ఇక్కడ ఈ విషయాలు ఎందుకంటారా? వాతావరణ వివరాల వల్ల సామాన్య జనానికి ఉపయోగం లేకున్నా, రైతులకు మాత్రం ఈ విషయాలు చాలా ముఖ్యం. తొలకరి పలకరించగానే రైతులు తమ సేద్యాన్ని మొదలుపెడతారన్నా విషయం తెలిసిందే. అయితే రియల్ టైమ్ వెదర్ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని చాలా […]

Update: 2021-07-02 06:49 GMT

దిశ, ఫీచర్స్ : బంగాళఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న రోజుల్లో తుఫాన్ వచ్చే సూచన, అక్కడక్కడ మూడు రోజులు జల్లులు పడే అవకాశం. ఈసారి నైరుతి ముందే పలకరించనుంది. ఇక్కడ ఈ విషయాలు ఎందుకంటారా? వాతావరణ వివరాల వల్ల సామాన్య జనానికి ఉపయోగం లేకున్నా, రైతులకు మాత్రం ఈ విషయాలు చాలా ముఖ్యం. తొలకరి పలకరించగానే రైతులు తమ సేద్యాన్ని మొదలుపెడతారన్నా విషయం తెలిసిందే. అయితే రియల్ టైమ్ వెదర్ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది రైతుల జీవనోపాధి ప్రభావితమైంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు రియల్ టైమ్ వాతావరణ సూచనలను అందిస్తూ ‘ఏపీ వెదర్‌మాన్’ గా ప్రసిద్ది చెందాడు సాయి ప్రణీత్‌.

24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయి ప్రణీత్ ఓ రోజు తెలుగు చానెల్స్ అందించే వాతావరణ వార్తలు చూస్తు్న్నాడు. ఆయా చానల్స్‌లో రెండు మూడు రోజుల వరకు వర్షం పడుతుందని ఇవ్వగా, మరికొందరు పడే అవకాశం లేదని వివరించారు. ఆ సమయంలో వర్షం పడటంతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. దాంతో సాయి వెదర్ న్యూస్ కచ్చితత్వంతో అందించి రైతులకు మేలు చేయాలని భావించాడు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న అనేక వెబ్‌సైట్లు ఉన్నప్పటికీ చాలా మంది అందించిన డేటాను అర్థం చేసుకోవడం కష్టమని వివరించాడు. అలాగే ప్రతి జిల్లాకు వివిధ వెబ్‌సైట్లు ఉన్నాయి. సాయి ఆయా వెబ్‌సైట్స్ అందించే డేటాను అధ్యయనం చేసి కంపైల్ చేస్తాడు.

తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ మైక్రో మెసేజ్‌లతో డిజిటల్ మ్యాప్‌లను ఉపయోగించి వివరణాత్మక సూచన వీడియోలను తయారుచేసి, రైతులకు అర్థమయ్యే రీతిలో సరళంగా వివరిస్తాడు. అతడి సోషల్ మీడియా వేదిక(యూట్యూబ్, ఫేస్‌బుక్‌)ల్లోనూ వీటిని అప్‌లోడ్ చేస్తాడు. దాంతో అనేక గ్రామీణ, పట్టణ ప్రజలకు ఈ సమాచారం ఎంతగానో సహాయపడుతోంది. అతడు రోజువారీ వాతావరణ సూచనలతో పాటు, వారపు వివరాలు కూడా అందిస్తాడు. 10 మంది అనుచరులతో ప్రారంభమైన, ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’ యూట్యూబ్ చానల్‌లో ప్రస్తుతం ఆరు వేలకుపైగా సబ్‌స్క్రైబర్స్ ఉండగా, ఫేస్‌బుక్‌లో 23కె, ట్విట్టర్‌లో 6కె ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సాయి కృషిని గుర్తించి యూఎన్ హాబిటాట్ జర్నల్‌ జూన్ సంచికలో అతడి గురించి ప్రచురించిడం విశేషం.

ఆగస్టు 2020లో సాయి దీన్ని ప్రారంభించాడు. సాయికి జావా, పైథాన్ వంటి కోడింగ్ భాషలపై పట్టు ఉండటంతో వాటిని ఉపయోగించి న్యూ కోడ్ రాశాడు. ఇది వివిధ సైట్ల నుంచి సంబంధిత వాతావరణ డేటాను సేకరిస్తుంది. అతడు దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కంపైల్ చేసి పోస్ట్ చేస్తాడు. తన ఉద్యోగం కొనసాగిస్తూనే తన వంతు బాధ్యతగా వెదర్ సమాచారం అందిస్తుండటంతో ‘ఏపీ వెదర్‌మ్యాన్’గా రైతులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్న సాయికి చిన్నప్పటి నుంచే వాతావరణ విశేషాలు చదవడమంటే మక్కువ. ఆ ఇష్టంతో బాల్యంనుంచే వాతావరణ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదివేవాడు.

Tags:    

Similar News