‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులే వారధి’
దిశ, నిజామాబాద్: ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్నీ ప్రజలకు చేరవేసే ఉద్యోగులే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తారని నిజామాబాద్ టీఎన్జీవో అధ్యక్షులు అలుక కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఉద్యోగులపైన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ధాన్యం కోనుగోలు వ్యవహారంలో మిల్లర్లతో ప్రభుత్వ ఉద్యోగులు కుమ్మక్కయ్యారనడం అబద్ధమని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యం కోసం […]
దిశ, నిజామాబాద్: ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్నీ ప్రజలకు చేరవేసే ఉద్యోగులే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తారని నిజామాబాద్ టీఎన్జీవో అధ్యక్షులు అలుక కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఉద్యోగులపైన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ధాన్యం కోనుగోలు వ్యవహారంలో మిల్లర్లతో ప్రభుత్వ ఉద్యోగులు కుమ్మక్కయ్యారనడం అబద్ధమని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యం కోసం రెవెన్యూ, సహకార, వ్యవసాయ, ఐకేపీ శాఖలు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నేతృత్వంలో అహర్నిశలు కష్టపడుతుంటే.. ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి కష్టపడటం వల్లే రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లా ఆరెంజ్ జోన్‌లోకి వచ్చిందని గుర్తు చేశారు.
Tags: Media Meeting, TNGO Bhavan, nizamabad, govt offices, lockdown