గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన కలెక్టర్

దిశ, మేడ్చల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు మూడు మొక్కల చొప్పున 365 రోజులు నాటనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగానే రాంపల్లిదాయర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం శామీర్ పేట మండలం తూంకుంట నుంచి తుర్కపల్లి వరకు హరితహారంలో భాగంగా రాజీవ్ రహదారికి ఇరువైపుల మొక్కలు […]

Update: 2020-06-08 09:16 GMT

దిశ, మేడ్చల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు మూడు మొక్కల చొప్పున 365 రోజులు నాటనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగానే రాంపల్లిదాయర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం శామీర్ పేట మండలం తూంకుంట నుంచి తుర్కపల్లి వరకు హరితహారంలో భాగంగా రాజీవ్ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటుటకు గుంతలు తీసే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Tags:    

Similar News