కొండగొర్రె మాంసం విక్రయదారుల పట్టివేత
దిశ, ఖమ్మం: పినపాక మండలం మల్లారం గ్రామంలో కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఫారెస్టు అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట ముమ్మరంగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్టు అధికారులు నిఘా ఉంచగా వీరిద్దరు పట్టుబడ్డారు. వన్య ప్రాణులను వేటాడితే మూడేళ్ల జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. tags;khammam,forest range,custody, Hill sheep
దిశ, ఖమ్మం: పినపాక మండలం మల్లారం గ్రామంలో కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఫారెస్టు అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట ముమ్మరంగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్టు అధికారులు నిఘా ఉంచగా వీరిద్దరు పట్టుబడ్డారు. వన్య ప్రాణులను వేటాడితే మూడేళ్ల జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.
tags;khammam,forest range,custody, Hill sheep