సులభతరం అవుతది : మేయర్
దిశ, న్యూస్‌బ్యూరో: నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు లాక్‌డౌన్ సమయంలో వేగంగా జరుగుతున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. టోలిచౌకి నుంచి గచ్చిబౌలి రహదారిలోని మల్కంచెరువు వరకు ఎస్.ఆర్.డి.పి కింద రూ. 333 కోట్ల వ్యయంతో 2.8 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ల పనులు చరుకుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. టోలిచౌకి-మల్కం […]
దిశ, న్యూస్‌బ్యూరో: నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు లాక్‌డౌన్ సమయంలో వేగంగా జరుగుతున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. టోలిచౌకి నుంచి గచ్చిబౌలి రహదారిలోని మల్కంచెరువు వరకు ఎస్.ఆర్.డి.పి కింద రూ. 333 కోట్ల వ్యయంతో 2.8 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ల పనులు చరుకుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. టోలిచౌకి-మల్కం చెరువు మధ్య నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌తో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలోని నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 20 పిల్లర్ల పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మొత్తం 65 పిల్లర్లలో 20 పిల్లర్లు 45 రోజుల్లోనే నిర్మించినట్లు మేయర్ తెలిపారు. అనంతరం పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి పనులను కూడా మేయర్ పరిశీలించారు.
Tags: Hyderabad, Lockdown, corona,GHMC, SRDP,CRMP, Development