మౌలిక వసతుల పనుల వేగం పెంచాలి
దిశ, న్యూస్‌బ్యూరో: మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. రోడ్ల నిర్వహణ, 3వేల మరుగుదొడ్ల నిర్మాణం, బస్ షెల్టర్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ది, స్టేడియంల నిర్వహణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర పనుల ప్రగతిని జోన్ల వారీగా సమీక్షించారు. నగరంలో 347 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టగా వాటిలో 90 బస్ షెల్టర్లు పూర్తయ్యాయని […]
దిశ, న్యూస్‌బ్యూరో: మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. రోడ్ల నిర్వహణ, 3వేల మరుగుదొడ్ల నిర్మాణం, బస్ షెల్టర్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ది, స్టేడియంల నిర్వహణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర పనుల ప్రగతిని జోన్ల వారీగా సమీక్షించారు. నగరంలో 347 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టగా వాటిలో 90 బస్ షెల్టర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 3 వేల మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లు వెడల్పుగా ఉన్నచోట కొత్త బస్-బేలను ఏర్పాటు చేయాలన్నారు. సర్కిళ్లవారీగా కార్పొరేటర్లు, ఈఈలతో పనుల ప్రగతిని చర్చించడంతో పాటు అత్యవసర పనులను చేపట్టేందుకు గుర్తించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మోడల్ గ్రేవ్ యార్డ్‌లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు కమిషనర్లు రాహుల్ రాజ్, యాదగిరిరావు, సీసీపీ దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.