మే పుష్పం.. నెల తప్పింది..!!

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనివిందు చేసింది. గుంటూరు జిల్లా వెదుళ్ళపల్లి గ్రామంలో ఓ ఇంటి వద్ద వికసించిన ఈ పుష్పం చూపరులను ఆకర్షిస్తోంది.  ఫుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే ఈ అరుదైన జాతి పువ్వును  భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పుష్పంగా […]

Update: 2021-06-20 00:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనివిందు చేసింది. గుంటూరు జిల్లా వెదుళ్ళపల్లి గ్రామంలో ఓ ఇంటి వద్ద వికసించిన ఈ పుష్పం చూపరులను ఆకర్షిస్తోంది. ఫుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే ఈ అరుదైన జాతి పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పుష్పంగా పిలుస్తారు. ఏడాదిలో ఒక్కసారే వికసించే ఈ పుష్పం అందరినీ ఆకట్టుకుంటుంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇకపోతే ఈ పుష్పం చూడ్డానికి ఎర్రని బంతిలా, ఆకట్టుకొనేలా ఉంటుంది. ఈ పుష్పాన్ని ప్రకృతి ప్రేమికులు తమ కెమెరాలలో బంధించి సోషల్ మీడియా లో వైరల్ గా మారుస్తున్నారు. ఇక ఈ పుష్పాన్ని చూస్తుంటే కరోనా వైరస్ గుర్తొస్తుందని, అచ్చు గుద్దినట్లు కరోనా ఆకృతిలోనే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Photo credits: Tata.Yasaswini

Tags:    

Similar News