మ్యాట్రిమోనీలో ‘మాయగాళ్లు’
దిశ, హైదరాబాద్ : ఆన్‌లైన్ బ్యాంకు మోసాలకు దీటుగా మ్యాట్రిమోనీ మోసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి లండన్‌లో వైద్యుడినంటూ మ్యాట్రిమోని సైట్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అది నమ్మిన మహిళ అతనితో రెగ్యులర్‌గా చాట్ చేసింది. పెళ్లి చేసుకుందాం నీకు విలువైన గిఫ్ట్‌లు పంపిస్తున్నాను, వాటిని పొందాలంటే రూ.7లక్షల ట్యాక్స్ కట్టాలని చెప్పాడు. నమ్మిన మహిళ మొత్తం డబ్బులు కట్టింది. తీరా చూస్తే పార్సిల్లో ఏమీ లేదు. మోసపోయానని అనుకున్న బాధితురాలు […]
దిశ, హైదరాబాద్ :
ఆన్‌లైన్ బ్యాంకు మోసాలకు దీటుగా మ్యాట్రిమోనీ మోసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి లండన్‌లో వైద్యుడినంటూ మ్యాట్రిమోని సైట్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అది నమ్మిన మహిళ అతనితో రెగ్యులర్‌గా చాట్ చేసింది. పెళ్లి చేసుకుందాం నీకు విలువైన గిఫ్ట్‌లు పంపిస్తున్నాను, వాటిని పొందాలంటే రూ.7లక్షల ట్యాక్స్ కట్టాలని చెప్పాడు. నమ్మిన మహిళ మొత్తం డబ్బులు కట్టింది. తీరా చూస్తే పార్సిల్లో ఏమీ లేదు. మోసపోయానని అనుకున్న బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్న ఓ వైద్యురాలు మళ్లీ వివాహం చేసుకొనేందుకు భారత్ మ్యాట్రిమోనీలోని డైవర్సీ కాలమ్‌లో రిజిస్టర్ చేసుకుంది. అదే సమయంలో డాక్టర్ విపుల్ ప్రకాష్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం చేసుకున్నాడు. తాను యూకే(లండన్)లో డాక్టర్ అంటూ ఆమెను నమ్మించాడు. వాట్సాప్, ఫేస్‌బుక్, మెయిల్స్‌లో ఇద్దరూ చాట్ చేసుకున్నారు. త్వరలోనే ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ లోపు నీకు విలువైన వజ్రాల నెక్లెస్ పంపిస్తున్నా..అందుకు ట్యాక్స్ రూ.7లక్షలు అవుతుందని చెప్పి నొక్కెశాడు. తీరా చూస్తే అందులో ఏమీ లేకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్టు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.నిందితుల వాట్సాప్ నెంబర్, ఇతర సామాజిక మాద్యమాలపై నిఘా పెట్టిన వారు మోసగాళ్లను పట్టుకున్నారు. అయితే మాట్రిమోనీ మోసాలు చేసే గ్యాంగ్‌లో మొత్తం అయిదు మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో ఇద్దరు నైజేరియన్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. కాగా, ప్రధాన నిందితుడు ఎసెలు ఉడో పరారీ ఉన్నాడని, అతన్నిత్వరలోనే పట్టుకుంటామని సీపీ సజ్జన్నార్ మీడియాకు తెలిపారు. అంతేకాకుండా ఈ మోసగాళ్లపై బెంగళూరులో పలు కేసులు ఉన్నట్టు కూడా తేలింది.
Tags: online matrymony cheating case. rs.7 lacs loss, gang arrest, 1 missing, cp sajjanar