పునీత్ మరణం తర్వాత .. కర్ణాటకలో మరో ఉద్యమం!
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గొప్ప ఆశయం కర్ణాటకలో ఒక ఉద్యమం సృష్టించింది. పునీత్ అకాల మరణం తర్వాత నేత్రదానం ఉద్యమం కర్ణాటకలో మరోసారి ఊపందుకుంది. పునీత్ కళ్లను సేకరించి నలుగురికి విజయవంతంగా అమర్చిన నారాయణ నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ భుజంగ శెట్టి మాట్లాడుతూ.. పునీత్‌ని ఆదర్శంగా తీసుకొని నాలుగైదు రోజుల్లో దాదాపు 1,500 మంది ముందుకు వచ్చి తమ కళ్లను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మింటో కంటి ఆసుపత్రి డైరెక్టర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గొప్ప ఆశయం కర్ణాటకలో ఒక ఉద్యమం సృష్టించింది. పునీత్ అకాల మరణం తర్వాత నేత్రదానం ఉద్యమం కర్ణాటకలో మరోసారి ఊపందుకుంది. పునీత్ కళ్లను సేకరించి నలుగురికి విజయవంతంగా అమర్చిన నారాయణ నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ భుజంగ శెట్టి మాట్లాడుతూ.. పునీత్‌ని ఆదర్శంగా తీసుకొని నాలుగైదు రోజుల్లో దాదాపు 1,500 మంది ముందుకు వచ్చి తమ కళ్లను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మింటో కంటి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నేత్రదాన ధోరణి క్రమంగా పెరుగుతోందన్నారు. పునీత్, సంచారి విజయ్ నేత్రదానం చేసిన తర్వాత నేత్రదానం 20 నుంచి 30 శాతం పెరిగిందని ఆమె తెలిపారు.