ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద.. 90 శాతం నిండిన ప్రాజెక్ట్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 90 టీఎంసీలకు గాను 80 టీఎంసీలు నిండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏ సమయంలో నైనా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటన ద్వారా జారీ చేసినట్టు ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం […]

Update: 2021-07-21 23:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 90 టీఎంసీలకు గాను 80 టీఎంసీలు నిండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏ సమయంలో నైనా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటన ద్వారా జారీ చేసినట్టు ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఉదయం 84721 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్‌లో 1091 అడుగులకు 1088.88 అడుగుల తో 90 టీఎంసీలకు గాను 80.139 నీరు నిల్వ ఉంది. గురువారం ఉదయం 12406 క్యూసెక్కుల వరద రాగా ప్రాజెక్ట్‌లో 72.908 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది.

మహారాష్ట్రలో భారీ వర్షాలకు తోడుగా సాయంత్రం బలేగాన్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 84 వేల క్యూసెక్కుల వరద రావడం 24 గంటల్లో ప్రాజెక్ట్‌లోకి 6 టీఎంసీల నీరు వచ్చి చేరింది. భారీ వర్షాల కారణంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి లక్ష్మి కాలువ ద్వారా జరుగుతున్న నీటి విడుదల నిలిపేశారు. గడిచిన ఏడాదికాలంగా ప్రాజెక్టులో ఇదేరోజు 36 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వరద ఇదే మాదిరిగా ఉధృతంగా ఉంటే గంటల వ్యవధిలో ప్రాజెక్ట్ నిండి పోవడం ఖాయం అని అధికారులు భావిస్తున్నారు.

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. ప్రాజెక్ట్‌లోకి 1820 క్యూసెక్కుల వరద వస్తుందటంతో ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలకు గాను 1.200 టీఎంసీలు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ 4,5,6 గేట్ల ద్వారా 1755 క్యూసెక్కులు, కాలువ ద్వారా 65 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Tags:    

Similar News