అప్పుడు మాస్క్ ధరించబోమని ఆందోళన చేశారట!

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం అత్యంత అవసరమని అందరికీ తెలుసు. కానీ, పాటించే విషయానికి వచ్చేసరికి ఎవరూ వంద శాతం న్యాయం చేయడం లేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నారు. సరిగ్గా 1918-19 మధ్య కాలంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగిందట. వ్యాధి తీవ్రత తగ్గించడానికి అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. వీలైనంత మేరకు ప్రచారం చేశారు. కానీ, ఎవరూ […]

Update: 2020-07-24 06:30 GMT

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం అత్యంత అవసరమని అందరికీ తెలుసు. కానీ, పాటించే విషయానికి వచ్చేసరికి ఎవరూ వంద శాతం న్యాయం చేయడం లేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నారు. సరిగ్గా 1918-19 మధ్య కాలంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగిందట. వ్యాధి తీవ్రత తగ్గించడానికి అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. వీలైనంత మేరకు ప్రచారం చేశారు. కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మాస్కు లేకుండా వీధుల్లో తిరిగినా, పనులకు హాజరైనా అరెస్టు చేయాలని నిబంధన తీసుకొచ్చారు. దీంతో పోలీసులు చెలరేగిపోయారు. ముఖ్యంగా అమెరికాలోని అరిజోనా, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో పెద్దమొత్తాల్లో అరెస్టులు చేశారు. ఎక్కడపడితే అక్కడ అరెస్టులు చేసి మహిళలు, పిల్లలను కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

ఇక దాంతో పోలీసుల దాష్టీకాన్ని ప్రశ్నిస్తూ అందరూ ఆందోళన చేయడం ప్రారంభించారు. వారు అలా ప్రవర్తించడానికి మాస్కుల నిబంధనే కారణమని అర్థమై, మాస్కులు ఎందుకు ధరించడం లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు సర్వే చేశాయి. ఇందులో కొన్ని నిజాలు బయటపడ్డాయి. మాస్కు ధరించడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఊపిరితీసుకోవడం ఇబ్బందిగా మారిందని, అలాగే నడిచేటపుడు కూడా ఊపిరి తీసుకోవడం, పని చేసేటపుడు కూడా మాస్కు ఒక అడ్డంకిగా మారిందని అందరూ సర్వేలో చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ నిబంధనలను సడలించారు. అయితే ప్రజలు ఆరోగ్యం కంటే సౌకర్యానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని ప్రొఫెసర్ ఈ. థామస్ ఈవింగ్ వివరించారు.

Tags:    

Similar News