మారుతీ సుజుకి 'స్విఫ్ట్' అరుదైన రికార్డు!
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా వల్ల ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, అనంతరం అంతే వేగంగా పుంజుకుంది. ఈ క్రమంలో గతేడాది 1,60,700 యూనిట్ల అమ్మకాలతో దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన కారుగా స్విఫ్ట్ మోడల్ నిలిచిందని మారుతీ సుజుకి తెలిపింది. అంతేకాకుండా 2005లో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ మొత్తం 23 లక్షల యూనిట్ల మైలురాయిని 2020లో దక్కించుకుందని వెల్లడించింది. ‘గత 15 ఏళ్లుగా స్విఫ్ట్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా స్థానం సంపాదించిందని’ […]
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా వల్ల ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, అనంతరం అంతే వేగంగా పుంజుకుంది. ఈ క్రమంలో గతేడాది 1,60,700 యూనిట్ల అమ్మకాలతో దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన కారుగా స్విఫ్ట్ మోడల్ నిలిచిందని మారుతీ సుజుకి తెలిపింది. అంతేకాకుండా 2005లో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ మొత్తం 23 లక్షల యూనిట్ల మైలురాయిని 2020లో దక్కించుకుందని వెల్లడించింది.
‘గత 15 ఏళ్లుగా స్విఫ్ట్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా స్థానం సంపాదించిందని’ మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ దశాబ్దన్నర కాలంలో స్విఫ్ట్ మోడల్ 2010లో 5 లక్షల యూనిట్ల మైలురాయిని, 2013లో 10 లక్షల మైలురాయిని, 2016లో 15 లక్షల యూనిట్ల మైలురాయిని దాటిందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ తమ మోడల్ 1,60,700 యూనిట్లు అమ్ముడై, అద్భుతమైన బ్రాండ్‌గా నిలవడం గర్వంగా ఉందని శశాంక్ వెల్లడించారు.