డిసెంబర్‌లో మారుతీ సుజుకి అమ్మకాలు 20 శాతం వృద్ధి!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుటీ సుజుకి ఇండియా 2020, డిసెంబర్ అమ్మకాల్లో 20.2 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం 1,60,226 యూనిట్లను విక్రయించిన మారుతీ సుజుకి, అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో 1,33,296 యూనిట్లను విక్రయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ అమ్మకాలు 17.8 శాతం పెరిగి 1,46,480 యూనిట్లకు చేరుకోగా, 2019, డిసెంబర్‌లో 1,24,375 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు 2019, డిసెంబర్ నాటితో పోలిస్తే […]

Update: 2021-01-01 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుటీ సుజుకి ఇండియా 2020, డిసెంబర్ అమ్మకాల్లో 20.2 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం 1,60,226 యూనిట్లను విక్రయించిన మారుతీ సుజుకి, అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో 1,33,296 యూనిట్లను విక్రయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ అమ్మకాలు 17.8 శాతం పెరిగి 1,46,480 యూనిట్లకు చేరుకోగా, 2019, డిసెంబర్‌లో 1,24,375 యూనిట్లుగా నమోదయ్యాయి.

మినీ కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు 2019, డిసెంబర్ నాటితో పోలిస్తే గత డిసెంబర్‌లో 4.4 శాతం పెరిగి 24,927 యూనిట్లకు చేరుకున్నాయి. అదేవిధంగా స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాల అమ్మకాలు 18.2 శాతం పెరిగి 77,641 యూనిట్లకు చేరుకున్నాయి. మిడ్-సైజ్ సెడా సియాజ్ అమ్మకాలు 28.9 శాతం పెరిగి 1,270 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. ఇక, ఎగుమతులు 31.4 శాతం పెరిగి 9,938 యూనిట్లుగా నమోదయ్యాయని, ఇక, డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 13.4 శాతం వృద్ధితో మొత్తం 4,95,897 యూనిట్లుగా నమోదయ్యాయని వెల్లడించింది.

Tags:    

Similar News