మారుతీ సుజుకి 'స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్'!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) పండుగ సీజన్ సందర్భంగా తన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ బ్లాక్ థీమ్‌తో తెచ్చిన ఈ మోడల్ ధర ఇదివరకే ఉన్న మోడల్ కంటే రూ. 24,999 అధికంగా రూ. 5.19 లక్షల నుంచి రూ. 8.02 లక్షల(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)కు లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్పెషల్ ఎడిషన్‌గా వస్తున్న ఈ కారుతో పాటు బ్లాక్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) పండుగ సీజన్ సందర్భంగా తన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ బ్లాక్ థీమ్‌తో తెచ్చిన ఈ మోడల్ ధర ఇదివరకే ఉన్న మోడల్ కంటే రూ. 24,999 అధికంగా రూ. 5.19 లక్షల నుంచి రూ. 8.02 లక్షల(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)కు లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్పెషల్ ఎడిషన్‌గా వస్తున్న ఈ కారుతో పాటు బ్లాక్ బాడీ కిట్, సైడ్ మోల్డింగ్, డోర్ వైజర్, ఫాగ్ లాంప్ లాంటి యాక్సెసరీస్‌ను కూడా అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.
‘స్విఫ్ట్ మోడల్ కారు తొలిసారి భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అత్యుత్తమ పనితీరుతో, స్విఫ్ట్ పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ సెల్లర్‌గానే కాకుండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో లీడర్‌గా కొనసాగుతోందని’ మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ఓ ప్రకటనలో తెలిపారు. గత మూడు తరాలుగా, ఈ మోడల్ కారు అనేక ఫీచర్లతో సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త జనరేషన్ వాహనదారులను ఆకట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కాగా, మారుతీ సుజుకి ఇప్పటివరకు 23 లక్షల యూనిట్ల స్విఫ్ట్ మోడల్ కార్లను విక్రయించింది.