మిచెల్ మార్ష్ లేకపోతే ఇంకెవరు?
దిశ, స్పోర్ట్స్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో తలపడిన సన్‌రైజర్స్ జట్టును చూసి.. ‘ఈ టీమ్‌కు ఏమైంది’ అని అభిమానులందరూ అనుకుంటున్నారు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న ఆర్సీబీని కట్టడి చేసిన సన్ రైజర్స్ ఆ తర్వాత బ్యాటింగ్‌లో శుభారంభాన్నే చేసింది. కానీ ఎప్పుడైతే టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ అవుటయ్యారో.. ఇక ఆ తర్వాత కేవలం ఐదు ఓవర్ల లోపు కుప్ప కూలింది. జట్టు కూర్పు సరిగా లేనందునే ఓటమి పాలయ్యిందని అభిమానులు కూడా సోషల్ […]
దిశ, స్పోర్ట్స్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో తలపడిన సన్‌రైజర్స్ జట్టును చూసి.. ‘ఈ టీమ్‌కు ఏమైంది’ అని అభిమానులందరూ అనుకుంటున్నారు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న ఆర్సీబీని కట్టడి చేసిన సన్ రైజర్స్ ఆ తర్వాత బ్యాటింగ్‌లో శుభారంభాన్నే చేసింది. కానీ ఎప్పుడైతే టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ అవుటయ్యారో.. ఇక ఆ తర్వాత కేవలం ఐదు ఓవర్ల లోపు కుప్ప కూలింది. జట్టు కూర్పు సరిగా లేనందునే ఓటమి పాలయ్యిందని అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు మిచెల్ మార్ష్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు బంతులు మాత్రమే విసిరిన మార్ష్.. గాయం కారణంగా పెవిలియన్‌కే పరిమితం అయ్యాడు. ఈ సీజన్‌లో అతను మళ్లీ సైన్‌రైజర్స్ తరఫున ఆడటం కష్టమేననే వార్తలు వస్తున్నాయి. కాగా, సన్‌రైజర్స్ జట్టు మిడిలార్డర్ భారాన్ని మోసే ఆటగాడు లేడని తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. హైదరాబాద్ జట్టు విదేశీ ఆటగాళ్ల మీద ఎక్కువగా ఆధారపడటం వల్లే ఈ సమస్య వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వార్నర్, బెయిర్‌స్టో, రషీద్ ఖాన్ తప్పకుండా జట్టులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విదేశీ ఆటగాడికి మరోస్లాట్ మాత్రమే మిగిలి ఉండటంతో తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను తీసుకున్నారు. ఇప్పుడు మార్ష్ లేకపోతే ఆ స్థానంలో కేన్ విలియమ్‌సన్ లేదా మహ్మద్ నబీలను తీసుకోవాలి. టాప్, మిడిల్ ఆర్డర్ బలంగా ఉండాలంటే విలియంసన్ ను తీసుకోవడమే మంచి ఛాయిస్. అయితే, మధ్య ఓవర్లలో సరైన బౌలర్ లేకపోవడం కూడా హైదరాబాద్ జట్టుకు నష్టం చేకూరుస్తున్నది. మరి ఈ సమస్యను హైదరాబాద్ జట్టు వచ్చే మ్యాచ్‌లో ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.