సర్పంచ్ నిరసన.. ఆ అధికారులు అలా చేసినందుకేనా ?

దిశ, యాదగిరిగుట్ట: అధికారులు దళిత సర్పంచ్ పైన వివక్ష చూపుతున్నారని మర్రి గూడెం సర్పంచ్ సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయం‌లో శనివారం ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశం రసవత్తరంగా సాగింది.  దళిత సర్పంచ్ పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని భూమి ఆక్రమణ‌కు గురి అవుతున్నదని పలుమార్లు విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని […]

Update: 2021-08-14 07:51 GMT

దిశ, యాదగిరిగుట్ట: అధికారులు దళిత సర్పంచ్ పైన వివక్ష చూపుతున్నారని మర్రి గూడెం సర్పంచ్ సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయం‌లో శనివారం ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశం రసవత్తరంగా సాగింది. దళిత సర్పంచ్ పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని భూమి ఆక్రమణ‌కు గురి అవుతున్నదని పలుమార్లు విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని కోరారు. అదే విధంగా తనను కులం పేరుతో దూషించిన పులుగం మనెమ్మ లక్ష్మీ నారాయణ పై పెట్టిన కేసు‌ను పోలీస్ అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. ఇదే విషయమై ఇటీవల మర్రి గూడెం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర కూడా చేపట్టాను అని మర్రిగూడెం సర్పంచ్ గడ్డం యాదయ్య ప్లకార్డులతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్, అశోక్ రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం తన హామీలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో సర్పంచ్ గడ్డం యాదయ్య సమస్య సద్దుమణిగింది.

 

Tags:    

Similar News