మిస్టరీగా వివాహిత మృతి.. భర్తే చంపాడా.. లేక..?

దిశ, సిద్దిపేట: అనుమానం పెనుభూతమై భార్యను బలిగొన్న సంఘటన సిద్ధిపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన వల్లేపు శ్రీనివాస్ తొమ్మిది సంవత్సరాల కిందట లక్ష్మి (28)ని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో అనుమానం అనే భూతం కలహాలు సృష్టించింది. గత కొన్ని రోజులుగా లక్ష్మిపై శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దల […]

Update: 2021-08-30 04:47 GMT

దిశ, సిద్దిపేట: అనుమానం పెనుభూతమై భార్యను బలిగొన్న సంఘటన సిద్ధిపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన వల్లేపు శ్రీనివాస్ తొమ్మిది సంవత్సరాల కిందట లక్ష్మి (28)ని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో అనుమానం అనే భూతం కలహాలు సృష్టించింది. గత కొన్ని రోజులుగా లక్ష్మిపై శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు.

దీంతో కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టి ఇరువురికి నచ్చచెప్పారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇరువురు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం లేచేసరికి లక్ష్మి శవమై కనిపించింది. శ్రీనివాస్ తెల్లవారు జామున లక్ష్మి గొంతు పిసికి చీర కొంగుతో గొంతుకు ఉరేసి హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త శ్రీనివాసే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వద్ద లక్ష్మి బంధువుల ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News