హ్యండ్ ఇచ్చిన వరుడు.. చివరి నిమిషంలో ఆగిన పెండ్లి
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఓ వైపు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా మరోవైపు.. వరుడు తనకు పెళ్లి ఇష్టం లేదని ముఖం చాటేయడంతో చివరి నిమిషంలో వివాహం నిలిచిపోయిన ఘటన చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జియాగూడ ప్రాంతానికి చెందిన అస్మద్ పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని చాలా రోజులుగా పెండ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. ఈ మేరకు యువతి తల్లిదండ్రులను కూడా అడిగి ఒప్పించాడు. దీంతో […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఓ వైపు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా మరోవైపు.. వరుడు తనకు పెళ్లి ఇష్టం లేదని ముఖం చాటేయడంతో చివరి నిమిషంలో వివాహం నిలిచిపోయిన ఘటన చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జియాగూడ ప్రాంతానికి చెందిన అస్మద్ పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని చాలా రోజులుగా పెండ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. ఈ మేరకు యువతి తల్లిదండ్రులను కూడా అడిగి ఒప్పించాడు. దీంతో వారు కట్నకానుకలు వంటివి మాట్లాడుకుని సోమవారం వివాహం చేసేందుకు నిశ్చయించారు.
బండ్లగూడ ప్రాంతంలోని నైన్ ఫంక్షన్ హాల్‌ను సైతం బుక్ చేసుకున్నారు. ముందు రోజు అస్మద్ కుటుంబ సభ్యులు కూడా యువతి ఇంటికి వచ్చి వివాహ ఏర్పాట్ల గురించి మాట్లాడి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం అస్మద్ కూడా పెండ్లి కూతురు ఇంటికి వచ్చి తాను పెండ్లికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పి పోయాడు. దీంతో యువతి తండ్రి ఫంక్షన్ హాల్ మాట్లాడి పెండ్లి వంటలు సైతం చేయించాడు. పెండ్లి కుమారుడు, అతని బంధువుల రాకకోసం ఎదురు చూస్తుండగా సాయంత్రం పెండ్లి కుమారుడు అదనపు కట్నం కోసం డిమాండ్ చేశాడు.
తాను అడిగినంత ఇవ్వకపోవడంతో పెండ్లి ఇష్టం లేదని ముఖం చాటేశాడు. చివరి నిమిషంలో పెండ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముందు వెంటపడి పెండ్లికి ఒప్పుకున్నాక.. అదనపు కట్నం డిమాండ్ చేసిన అస్మద్‌ను కఠినంగా శిక్షించాలని పోలీస్‌లను కోరారు.