మేడ్చల్‌లో డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నెలకొల్పండి
దిశ, న్యూస్‌బ్యూరో: మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్ (ఐ.డీ.టీ.ఆర్), రీజినల్ డ్రైవర్ ట్రైనర్ సెంటర్ (ఆర్.డీ.టీ.సీ) నెలకొల్పాలని టీఆర్ఎస్ పార్టీ మల్కాజగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి రవాణాశాఖ మంత్రిని కోరారు. మంత్రి అజయ్ కుమార్‌ను శనివారం హైదరాబాద్‌లో కలిసిన రాజశేఖర్‌రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సంస్థలు నెలకొల్పడం ద్వారా మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో డ్రైవర్లు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రోడ్డు భద్రత పట్ల […]
దిశ, న్యూస్‌బ్యూరో: మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్ (ఐ.డీ.టీ.ఆర్), రీజినల్ డ్రైవర్ ట్రైనర్ సెంటర్ (ఆర్.డీ.టీ.సీ) నెలకొల్పాలని టీఆర్ఎస్ పార్టీ మల్కాజగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి రవాణాశాఖ మంత్రిని కోరారు. మంత్రి అజయ్ కుమార్‌ను శనివారం హైదరాబాద్‌లో కలిసిన రాజశేఖర్‌రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సంస్థలు నెలకొల్పడం ద్వారా మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో డ్రైవర్లు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంపొందించడానికి కూడా దోహదపడుతుందని మంత్రికి వివరించారు.