ఆరుగురు మావోయిస్టు కమిటీ సభ్యుల లొంగుబాటు
దిశ,ఖమ్మం: మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆరుగురు సభ్యులు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కుర్నపల్లి గ్రామస్తుల చొరవతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఆరుగురూ కూడా అదే గ్రామానికి చెందిన వారే కావడం గమనార్హం. గ్రామానికి చెందిన 200 మంది చర్ల పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆరుగురు సభ్యుల లొంగుబాటును అంగీకరించాలని పోలీసులకు విన్నవించారు. దీంతో సానుకూలంగా స్పందించిన పోలీసులు ఆదివారం గ్రామంలో ప్రజల సమక్షంలో మావోయిస్టులు కోరం నాగేశ్వర్‌రావు, కొమరం రమేష్, సోందే […]
దిశ,ఖమ్మం: మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆరుగురు సభ్యులు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కుర్నపల్లి గ్రామస్తుల చొరవతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఆరుగురూ కూడా అదే గ్రామానికి చెందిన వారే కావడం గమనార్హం. గ్రామానికి చెందిన 200 మంది చర్ల పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆరుగురు సభ్యుల లొంగుబాటును అంగీకరించాలని పోలీసులకు విన్నవించారు. దీంతో సానుకూలంగా స్పందించిన పోలీసులు ఆదివారం గ్రామంలో ప్రజల సమక్షంలో మావోయిస్టులు కోరం నాగేశ్వర్‌రావు, కొమరం రమేష్, సోందే రమేష్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఏఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇక మీదట నిషేధిత మావోయిస్ట్ పార్టీకి సహకరించేది లేదని గ్రామస్తులంతా తీర్మానం చేసుకోవడం గమనార్హం.