25మంది గిరిజనుల హత్య !

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఏకంగా 25మంది గిరిజనులను హతమార్చారు. బీజాపూర్‌ జిల్లాలోని పోలీస్ అధికారులు నియమించిన 12మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8మంది ఇన్‌ఫార్మర్లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాకోర్టులో శిక్షించామని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు వస్తున్నారని పోలీసులు బాంబులు పెట్టి అమయాకులను చంపి తమపై విష ప్రచారం చేస్తున్నారు. […]

Update: 2020-10-08 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఏకంగా 25మంది గిరిజనులను హతమార్చారు. బీజాపూర్‌ జిల్లాలోని పోలీస్ అధికారులు నియమించిన 12మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8మంది ఇన్‌ఫార్మర్లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాకోర్టులో శిక్షించామని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు వస్తున్నారని పోలీసులు బాంబులు పెట్టి అమయాకులను చంపి తమపై విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల 8మందిని ఎన్‌కౌంటర్ చేశారు. ఈ పాశవిక దామనకాండను ఖండిస్తూ 25మంది ఏజెంట్లను ప్రజాకోర్టులో శిక్షించాం అని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తెలిపింది.

Tags:    

Similar News