ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: 17 మంది జవాన్లు మృతి

దిశ, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, సుక్మా జిల్లాలో కేంద్ర బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎన్‌కౌంటర్ తరువాత జవాన్ల మృతదేహాలు అదృశ్యమయ్యాయి. దాదాపు 24 గంటలకు పైగా డ్రోన్ల సాయంతో మృతదేహాల కోసం గాలించారు. మృతుల్లో ముగ్గురు స్పెషల్ టాస్క్ ఫోర్స్, 14 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పది […]

Update: 2020-03-22 20:01 GMT

దిశ, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, సుక్మా జిల్లాలో కేంద్ర బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎన్‌కౌంటర్ తరువాత జవాన్ల మృతదేహాలు అదృశ్యమయ్యాయి. దాదాపు 24 గంటలకు పైగా డ్రోన్ల సాయంతో మృతదేహాల కోసం గాలించారు. మృతుల్లో ముగ్గురు స్పెషల్ టాస్క్ ఫోర్స్, 14 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పది ఏకే 47, ఐదు ఆటోమెటిక్ రైఫిల్స్ ను మావోలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల సమావేశం జరుగుతోందని ఇంటెలిజన్స్ ద్వారా భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో సుమారు 600 మందితో కూడిన భద్రతా దళాలు అడవిని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో మన్నప్ప అటవీ ప్రాంతం సమీపంలో కొందరు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి.

Tags:    

Similar News