మావోయిస్టు కరపత్రాలు కలకలం.. వారిలో టెన్షన్.. టెన్షన్
దిశ, వాజేడు: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. పేరూరు-చండ్రుపట్ల గ్రామాల మధ్యగల రహదారిపై మర్రిచెట్టు పరిసర ప్రాంతాలు మావోయిస్టు కరపత్రాల వెలువడటంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దీంతో స్థానిక ప్రజలందరూ భయాందోళనకుగురవుతున్నారు. ఈ నెల 21 నుండి దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ 17వ వార్షిక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతేగాక.. ‘‘ప్రజాస్వామిక స్వయంప్రతిపత్తి ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రాల కోసం […]
దిశ, వాజేడు: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. పేరూరు-చండ్రుపట్ల గ్రామాల మధ్యగల రహదారిపై మర్రిచెట్టు పరిసర ప్రాంతాలు మావోయిస్టు కరపత్రాల వెలువడటంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దీంతో స్థానిక ప్రజలందరూ భయాందోళనకుగురవుతున్నారు. ఈ నెల 21 నుండి దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ 17వ వార్షిక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
అంతేగాక.. ‘‘ప్రజాస్వామిక స్వయంప్రతిపత్తి ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రాల కోసం కొనసాగుతున్న ఆదివాసీ ఉద్యమాలను సమర్దిద్దాం. సామ్రాజ్యవాదుల దళారి, నిరంకుశ, పెట్టుబడిదారులు, భూస్వాములకు వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని, గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేద్దాం. బలమైన రహస్య పార్టీగా తీర్చిదిద్దుదాం. రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి.’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరపత్రంలో పొందుపరిచారు. ఈ మావోయిస్టు కరపత్రాలు వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో వెలువడ్డాయి. దీనితో మావోయిస్టు టార్గెట్ నేతల్లో భయాందోళన మెదలైంది. విషయం తెలుసుకున్న పేరూరు పోలీసులు కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.