ధర్మారం సీఆర్‌పిఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్, పామేడు పోలీస్‌స్టేషన్ పరిథిలోని ధర్మారం సీఆర్‌పిఎఫ్ 196వ బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించారు. చాకచక్యంగా భద్రతా బలగాలు మావోయిస్టుల దాడిని తిప్పికొట్టారు. సీఆర్‌పిఎఫ్ పోలీసుల శిబిరంపైకి అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగానే రెప్పపాటున జవాన్లు తేరుకొని ఎదురుకాల్పులు జరిపారు. సుమారు గంటకిపైగా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. చివరకు పోలీసుల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. ఈ కాల్పులను బీజాపూర్ […]

Update: 2021-09-27 10:16 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్, పామేడు పోలీస్‌స్టేషన్ పరిథిలోని ధర్మారం సీఆర్‌పిఎఫ్ 196వ బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించారు. చాకచక్యంగా భద్రతా బలగాలు మావోయిస్టుల దాడిని తిప్పికొట్టారు. సీఆర్‌పిఎఫ్ పోలీసుల శిబిరంపైకి అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగానే రెప్పపాటున జవాన్లు తేరుకొని ఎదురుకాల్పులు జరిపారు. సుమారు గంటకిపైగా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. చివరకు పోలీసుల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం.

ఈ కాల్పులను బీజాపూర్ ఎస్‌పి పంకజ్ శుక్లా ధృవీకరించారు. కాల్పుల శబ్దం పామేడ్ గ్రామం వరకు వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైనారు. మావోయిస్టు పార్టీ 17వ వార్షికోత్సవ వారోత్సవాల ముగింపు (ఆఖరి) రోజున మావోయిస్టులు ఏకంగా పోలీస్ శిబిరంపైకి తెగించి రావడం గమనార్హం. ఈ సంఘటన నేపథ్యంలో సరిహద్దుగా ఉన్న భద్రాద్రి ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత చర్ల, దుమ్మగూడెం మండలాల్లో పోలీసులు అప్రమత్తమైనారు.

Tags:    

Similar News