మావోయిస్టుల ఘాతుకం.. జేసీబీకి నిప్పు
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఫరస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త బిర్జూ సలామ్‌ని శుక్రవారం రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. సుమారు 30 మంది నక్సల్స్ ఈ ఘటనలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం జేసీబీకి నిప్పుపెట్టి తగులబెట్టారు. ఈ రెండు ఘటనల అనంతరం మావోయిస్టులు ఒక పోస్టర్ అంటించి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, వంతెన నిర్మాణంలో బిర్జూ చురుకైన పాత్ర పోషిస్తున్నాడని […]
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఫరస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త బిర్జూ సలామ్‌ని శుక్రవారం రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. సుమారు 30 మంది నక్సల్స్ ఈ ఘటనలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం జేసీబీకి నిప్పుపెట్టి తగులబెట్టారు. ఈ రెండు ఘటనల అనంతరం మావోయిస్టులు ఒక పోస్టర్ అంటించి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, వంతెన నిర్మాణంలో బిర్జూ చురుకైన పాత్ర పోషిస్తున్నాడని మావోయిస్టులు ఆ పోస్టర్‌లో ఆరోపించారు.
మావోయిస్టు పార్టీ నేల్నార్ ఏరియా కమిటీ ఈ ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం నారాయణపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కి.మీ దూరంలో ఉంది. ఈ ఘటనతో సర్పంచ్ సహా కుటుంబ సభ్యులు భయంతో సొమ్మసిల్లినట్లు సమాచారం. శనివారం ఉదయం సమాచారం తెలియగానే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి వెళ్ళి గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.