అదిరిపోయే బిజినెస్ ఐడియా.. టీ వ్యాపారంతో నెలకు రూ. 30 వేలు సంపాదించండిలా ..

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఎక్కువగా యువత ప్రైయివేట్ జాబ్‌లు చేయడం కన్న బిజినెస్ పెట్టుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అయితే కొంత మంది మాత్రం బిజినెస్ పెట్టాలనే ఆలోచనతో ఉండి ఏం బిజినెస్ పెట్టాలి, ఏది పెడితే మంచి లాభం వస్తుంది అని ఆలోచిస్తూ సరైన ప్లానింగ్ లేక సంవత్సరాలుగా ఆలోచిస్తూ టైం […]

Update: 2021-11-24 00:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఎక్కువగా యువత ప్రైయివేట్ జాబ్‌లు చేయడం కన్న బిజినెస్ పెట్టుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అయితే కొంత మంది మాత్రం బిజినెస్ పెట్టాలనే ఆలోచనతో ఉండి ఏం బిజినెస్ పెట్టాలి, ఏది పెడితే మంచి లాభం వస్తుంది అని ఆలోచిస్తూ సరైన ప్లానింగ్ లేక సంవత్సరాలుగా ఆలోచిస్తూ టైం వేస్టు చేస్తున్నారు. అయితే బిజినెస్ పెట్టాలని ఆలోచించేవారు టీ బిజినెస్ చేయడం వలన చాలా మంచి లాభాలు గడించవచ్చునని కొందరు అంటున్నారు.

ఈ మధ్య కాలంలో టీ బిజినెస్‌కు చాలా డిమాండ్ పెరిగింది. పల్లె నుంచి పట్నం దాక రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా టీ షాప్‌లే దర్శనం ఇస్తాయి. ప్రస్తుతం ఎవరిని చూసినా టీ తాగడానికి వెళ్దాం అని అంటూ ఉంటారు. మరికొంత మంది అయితే ఇంట్లో కన్న బయట స్నేహితులతో టీ తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలా టీకి డిమాండ్ ఎక్కువగా పెరగడంతో టీ రేటు కూడా పెరిగింది. రూ .5 నుంచి రూ.30 వరకు టీ ధర పెరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు, బయట టీ కి ఎంత డిమాండ్ ఉందో.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో టీ వ్యాపారం కార్పొరేట్ రంగు పులుముకుంది. కొన్ని ప్రత్యేక కంపెనీలు యువకుల చేత టీ స్టాల్ పెట్టించి రెండు నెలల పాటు శిక్షణ కూడా ఇస్తున్నారు. టీ పొడి పాలు మొదలు అన్ని ఆయా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇలా యువకుల చేత టీ స్టాల్స్ పెట్టించి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. అందు వలన టీ వ్యాపారంతో మంచి లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారం‌తో దాదాపు 20 వేల రూపాయల నుంచి 30 వేల వరకు సంపాదించొచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం టీ బిజినెస్ పెట్టి మంచి ఆదాయం పొందండి.

Tags:    

Similar News